తోటకూర శెనగలు ఆవపులుసు
కావలిసిన పదార్దాలు:
తరిగిన తోటకూర ఆకులు - 1 కప్పు
శెనగలు - గుప్పెడు
ఉప్పు - 1 స్పూన్
కరం - 1 స్పూన్
సాంబార్ పొడి - 1 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
ఆవపొడి - 1/4 &1/2 స్పూన్
ఉల్లితరుగు - 2 స్పూనుస్
పచ్చిమిర్చి - 2
కరివేపాకు లు - 8 & 10
నూనె - పోపుకి తగినంత పోపుగింజలు
తయారీవిధానం:
ముందుగా పాన్ లో ఎండి మిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయించుకొని.. ఆ నూనెలో ఉల్లితరుగు, పర్చిమిర్చి, కరివేపాకు వేయాలి. పోపురంగుమారక తోటకూర ఆకులు తరుగు వేసి పసుపు వేసి కొద్దిగా వేయించి మూతపెట్టి ప్రక్కన పెట్టుకుని వెడల్పు గిన్నె( లేదా ) దళసరి పులుసు గిన్నెలో నీరుపోసి పూర్తిగా శెనగలు ఉడకనివ్వాలి . అందులో చింతపండు నీళ్ళు, కారం ,వరిపిండి కలిపిన మిశ్రమం వేసి ఇష్టమైతే చిన్న బెల్లం గడ్డ జోడించి పులుసు మరిగించి.. అందులో వేయించిన తోటకూర మరియు పోపుసామాను కలపాలి. స్టావ్ ఆఫ్ చేసి ..సాంబారు పొడి ,ఆవపిండి జల్లి కొద్దిగా నూనె జోడించి.. అన్నంలో వడ్డించాలి. చాలారుచిగా ఉంటుంది.