స్వీట్ ఇడ్లీ
కావలసినవి :
ఇడ్లీ రవ్వ- ఒకటిన్నర కప్పు
వంటసోడా - చిటికెడు
నెయ్యి - కొద్దిగా
ఎండు ఖర్జూరం - కొద్దిగా
కిస్మిస్ - ముప్పావ్ఞ కప్పు
మినపప్పు- ఒక కప్పు
ఇలాచి పొడి- అర టీస్పూన్
కొబ్బరి తురుము - అర కప్పు
ఉప్పు- సరిపడగా
పంచదార - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
తయారీ :
ముందుగా మినపప్పుని నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉప్పు కలిపి నైట్ అంతా అలా ఉంచాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినప్పిండిలో రవ్వ, ఉప్పు కూడా వేసి కలపాలి. తరువాత ఇడ్లీ పిండిలో కొబ్బరి తురుము ఇలాచి పొడి, పంచదార, కిస్మిస్, ఎండు ఖర్జూరం, పాలు వేయించుకున్న రవ్వ కూడా వేసి కొద్దిసేపు ఆ పిండిని అలానే ఉంచి తరువాత ఇడ్లీలు వేసుకోవాలి. అంతే వేడి వేడి స్వీట్ ఇడ్లీలు రెడీ