స్వీట్ కార్న్ దోశ

 

 

స్వీట్ కార్న్ తీయగా వుంటుంది., దానిని దోసలతో మ్యాచ్ చేస్తే రుచి బలే వుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.

 

కావలసిన పదార్థాలు:

దోసల పిండి - సరిపడా

స్వీట్ కార్న్ - ఒక కప్పు

టమాటో లు - రెండు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర - తగినంత

కసూరి మేతి - అర చెమ్చా

ధనియాల పొడి - అర చెమ్చా

జీలకర్ర పొడి - పావు చెమ్చా

నూనె - 5 చెంచాలు

ఉప్పు ,కరం - తగినంత

 

తయారి విధానం:

ముందుగా బాణలిలో రెండు చెంచాల నూనె వేసి ,వేడి ఎక్కాక సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కసూరి మేతి వేయాలి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అవి వేగాక టమాటో ముక్కలు వేయాలి. (అన్ని సన్నగా తరగాలి ), ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక్క అయిదు నిమిషాల తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీల కర్ర పొడి, వేసి కలిపి , మూత లేకుండా ఓ అయిదు నిముషాలు ఉంచాలి. మరి పలచగా కాకుండా, మరి గట్టిగా కాకుండా వుండాలి కూర. కూర రెడీ అయ్పోయింది కాబట్టి, దోసల పెనం వేడెక్క గానే ..దోస వేసి ఆ పయిన దోస పొడి వేసి, ఆ పయిన ఈ కూర వేసి , దోస ఎర్రగా కాలాక మధ్యకి మడచి తీయాలి. ఈ దోస కి చట్నీ కాంబినేషన్ ఎంటో తెలుసా ? పుల్లగా, తీయగా వుంటుంది ఈ దోస , కాబట్టి కమ్మగా వుండే చట్నీ అయితే బావుంటుంది. కొబ్బరి, పల్లీలు వేసి పచ్చి మిర్చి తో నూరి ఇంగువ పోపు వేసి చేసే చట్నీ ఈ దోసకి బావుంటుంది. మరి స్వీట్ కార్న్ దోస చేసుకుని ..రుచి ఎలా వచ్చిందో చెప్పండి..

 

టిప్స్ : ఈ దోస కి అయినా ..మంచి రుచి రావాలంటే దోస పొడి వేయాలి. దాని తయారి సులువే . ఒక చిన్న కప్పు కొబ్బరి పొడి కి , అందులో సగం పల్లిల పొడి, అందులో సగం పుట్నాల పొడి, ఒక చెమ్చా వేయించిన జీల కర్ర పొడి, ఒక అర చెమ్చా వేయించిన ధనియాల పొడి, ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ,ఉప్పు , కారం కలిపి ఒక సారి మెత్తగా గ్రైండ్ చేసి దోస వేసాక పయిన చల్లాలి...దోస పొడి చల్లాక ఆ మీద పావు చెమ్చా అక్కడక్కడా వేస్తే భలే రుచి వస్తుంది దోస..

- రమ