స్వీట్ అండ్ సోర్ చాట్ 

  

కావలసిన పదార్ధాలు:

పొటాటో - రెండు 

స్వీట్ పొటాటో - ఒకటి 

పెరుగు - మూడు చెమ్చాలు

పుదిన ప్యూరి - ఒక చెమ్చా 

డ్రై మంగో పౌడర్ - అర చెమ్చా 

ఉప్పు - సరిపడ 

కారం - తగినంత 

నిమ్మ రసం - పావు చెమ్చా 

చాట్ మసాలా - పావు  చెమ్చా 

మిరియాల పొడి - చిటికడు 

స్వీట్ చట్నీ - అర చెమ్చా  

నూనె - రెండు చేమ్చాలు 

తయారి విధానం:

ముందుగా బంగాళా దుంపలని , చిలకడ దుంపలని క్యూబ్ లుగా కట్ చేసుకోవాలి. అన్ని ఒక సైజు లో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని వేడి , వేడి నీటిలో వేసి  ఒక్క ఉడుకు వచ్చేలా పోయ్యమీద పెట్టి , తీసేయ్యాలి. అంటే పూర్తిగా మెత్త పడకూడదు అన్నమాట.ఆ తర్వాత వాటిని పెనం మీద కొన్ని , కొన్ని వేసి , కొద్దిగా నూనెతో అన్ని వైపులా ఎర్రగా వచ్చేలా వేయించాలి.  ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టి నప్పుడే ఒక కప్పులో పెరుగు, మిరియాల పొడి ,ఉప్పు , కారం, కలిపి ఉంచాలి. అలాగే పుదినా చట్నీ  కూడా చేసి పెట్టుకోవాలి. (పుదినా ని కొంచం, ఉప్పు,పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.) అలాగే చింతపండు, ఖర్జూరం ,ఉప్పు,కారం కలిపి గ్రైండ్ చేస్తే  స్వీట్ చట్నీ రెడీ అవుతుంది. వీటిని కూడా రెడీ చేసుకున్నాకా ..ఇప్పుడు వేయించిన పొటాటో ,స్వీట్ పొటాటో ముక్కలని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో డ్రై మంగో పౌడర్, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. చిటికెడు ఉప్పు, కారం కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి. (ఆల్రెడీ చెట్నీ లలో ఉప్పు , కారం వున్నాయి ) వడ్డించే ముందు పెరుగు మిశ్రమం, స్వీట్ చట్నీ , పుదినా చట్నీ కొంచం , కొంచం వేసి వడ్డించాలి. రుచి కోసం కొంచం నిమ్మరసం పయిన వేయాలి. అంటే రుచిగా వుండే స్వీట్ అండ్ సోర్ చాట్ రెడీ ..

 

టిప్స్ :  ఈ చాట్ హేల్తి వెర్షన్ ..చాలా సింపుల్ . వేయించే పద్దతి పెట్టుకోకుండా, కొంచం మెత్త పడేలా ఉడికించాలి. ఆ తర్వాత అన్ని చట్నీ లు అందులో కలిపి వడ్డించాలి .

 

 - రమ