స్టఫ్డ్  క్యాప్సికం

 

 

 

కావాల్సినవి :
క్యాప్సికం - అర కేజీ
శనగ పిండి - అర కేజీ
ఉప్పు -- రెండు టీ స్పూన్స్
కారం -ఒక టీ స్పూన్
నూనె - రెండు గరిటెలు
వాము - ఒక టీ స్పూన్

 

తయారీ :
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగ పిండి,ఉప్పు,కారం ,వాము, రెండు టీ స్పూన్స్ నూనె వేసి పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం ను తీసుకుని బాగా కడిగి గుత్తి వంకాయ కూరకు కట్ చేసినట్టు  క్యాప్సికంను కట్  చేసి అందులో  కలిపి ఉంచుకున్న పిండిని స్టఫ్ చేసి తరువాత ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి  నూనె వేసి రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికం లను  వేసి చిన్న మంట మీద వేయించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ కి సైడ్ డిష్ గా సర్వ్ చేసుకోవచ్చు...