స్ట్రాబెర్రీ కప్ కేక్
కావలసిన పదార్థాలు :
స్ట్రాబెర్రీస్ -15
పంచదార - కేజీ
మైదా -2 కప్స్
పాలు - అర కప్పు
బట్టర్ - అర కప్పు
ఉప్పు- చిటికెడు
జీడిపప్పు- అర కప్పు
బాదాం - 10
అక్రూట్ -7
బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్స్
ఇలాచి పొడి -1/2 స్పూన్
తయారీ :
ముందుగా స్ట్రాబెర్రిస్ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు,అక్రూట్,బాదాం మరీ పేస్ట్ లా కాకుండా కొంచం పలుకు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె లో గ్రైండ్ చేసిన స్ట్రాబెర్రి పేస్ట్ ,పంచదార బటర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె లో మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, గ్రైండ్ చేసిన జీడిపప్పు పేస్ట్, ఇలాచి పొడి వేసి బాగా కలిపి స్ట్రాబెర్రి మిక్స్ కూడా వేసి మళ్ళీ మొత్తం కలపాలి. మద్యలో పాలు కూడా పోసి పిండిని కొంచం జారుగా కలుపుకోవాలి..తరువాత కప్ కేక్ ట్రే లో,తయారు చేసుకున్నమిశ్రమాన్ని సగానికి వేయాలి. ఇప్పుడు ఒవన్ 350 డిగ్రీస్ లో పెట్టి 5 నిముషాలు వేడి చేసి నింపి పెట్టుకున్న ఒవెన్ లో పెట్టి అరగంట పాటు ఉంచాలి. తరువాత ఒవెన్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన కేక్స్ ను ట్రే నుంచి తీసి సర్వ్ చేసుకోవాలి.