స్పైసీ ఆలూ రెసిపి

 

 

 

స్పైసీ ఆలూ కి కావలసిన పదార్ధాలు:

ఆలుగడ్డలు - 5

పచ్చిమిర్చి - 3

గరం మసాల -1 స్పూన్

నూనె - 3 స్పూన్స్ కారం - 2 స్పూన్

ఆవాలు - కొద్దిగ లవంగాలు - 2

కొబ్బరి పొడి - 2 స్పూన్స్

ఉప్పు - తగినంత

పెరుగు - 50గ్రా

అల్లం, వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్

 

స్పైసీ ఆలూ తయారు చేసే విధానం:

ముందుగా ఆలుగడ్డలు ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, లవంగాలు వేసి కొద్దిగ వేయించాలి.

అవి చిటపటలాడుతుండగా అల్లం, వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొద్దిగ కరివేపాకు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, గరం మసాల పొడి మరియు పెరుగు కూడా వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమం కొద్దిగ ఉడుకుతున్నప్పుడు అందులో కట్ చేసిన ఆలూ ముక్కలు వేసి 5 నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి.

చివరగా కొబ్బరి పొడి మరియు కొద్దిగ కొత్తీమీర వేసుకొని దించెయ్యాలి.

అంతే చాలా రుచిగా ఉండే స్పైసీ ఆలు తయార్. దీనిని చపాతీ లేక అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.