స్పెషల్  ఆలూ పకోడీ

 

 

 

 

కావలసినవి :
ఆలూ :  నాలుగు
నూనె :తగినంత
కార్న్ ఫ్లోర్ : 2 స్పూన్స్
పెరుగు - ఒక కప్పు
మైదా పిండి : ఒక టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి : ఒక స్పూన్
కరేపాకు : సరిపడా
కొత్తిమీర : కొద్దిగా
కారం : ఒక స్పూన్
ఫుడ్ కలర్ : చిటికెడు
మిరియాల పొడి : ఒక స్పూన్
పచ్చిమిర్చిలు : ఎనిమిది
ఉప్పు : తగినంత

 

తయారీ:
ముందుగా బంగాళాదుంపలు ఉడికించి తొక్క తీసి  ముక్కలు కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నూనె పోసి కార్న్ ఫ్లోర్, మైదా, కారం, మిరియాల పొడి, ఫుడ్ కలర్, ఉప్పు, అల్లం వెల్లులి, పెరుగు కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం గుజ్జులా తయారు చేయాలి.ఇందులో బంగాళా దుంపల ముక్కల్ని ముంచి  పది నిముషాలు ఉంచి తరువాత స్టవ్ వెలిగించి పాన్ లో సరిపడా నూనె వేసుకుని కాగాక పిండిలో ముంచిన ఆలూని పకోడిలాగా వేయించి ప్లేట్ లోకి తీసిపెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి కొంచెం నూనె పోసి కరేపాకు, కొత్తిమీర, వేయించిన ఆలూ ముక్కలు వేసి సన్నని సెగ మీద ఉంచాలి. కొద్దిగా నీళ్ళు పోసి బాగా వేగాకా కారం వేసి  కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి వీటిని స్నాక్స్ లా కాని లేదా రైస్ లో సైడ్ డిష్ లా కాని తీనొచ్చు...