సోయాబీన్స్ కుర్మా రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు
సోయాబీన్స్ : 1 కప్పు
ఉప్పు  : రుచికి తగినంత
నూనె :1/2 కప్పు
ఆవాలు : 1 స్పూన్
పచ్చికొబ్బరి :1/2 కప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద :1/2 టీ స్పూను
టమాటాలు  :3
క్యారెట్ : 3
ఆలూ  : 2
పుదీనా ఆకులు :ఒక కట్ట
పచ్చి మిర్చి : 5
యాలకులు : 3
లవంగా లు : నాలుగు
పసుపు  : చిటికెడు
ఉల్లిపాయలు : 2
కార్న్ ఫ్లోర్ పిండి : 2 స్పూన్లు

 

తయారు చేసే పధ్ధతి :

 

ముందుగా  బీన్స్ ను రాత్రి  నానబెట్టుకోవాలి ఇప్పుడు  ఆలూ, సోయా బీన్స్,క్యారెట్ కలిపి ఉడికించాలి .ఇప్పుడు  మసాలా పేస్ట్ చెయ్యాలి దానికోసం,అల్లంవెల్లుల్లి ముద్ద,యాలకులు , పచ్చికొబ్బరి, లవంగాలు ,పుదీనా ఆకులు, మిర్చి,  అన్ని కలిపి మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి  ఆవాలు ,ఉల్లిపాయ ముక్కలు ,టమాటా ముక్కలు ,పసుపు,ఉప్పు , వేసి కలిపి ఒక రెండు నిముషాలు వేగనివ్వాలి.ఇప్పుడు ఉడికించిన పెట్టుకున్న సోయాబీన్స్,వేసి సరిపడా  నీళ్ళు పోసి ఐదు నిముషాలు ఉడికించాలి .తరువాత మసాలా పేస్ట్ వేసి కలిపి కొద్దిసేపు ఉడికించాక చివరిలో అర కప్పు నీళ్ళు తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ పిండి కలిపి కర్రీ లో వేసేయ్యాలి .ఒక రెండు నిముషాలు అయ్యాక  స్టవ్ ఆఫ్ చేసుకుని  సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.