షాహీ పనీర్
పనీర్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. పనీర్ తో చాలా రకాల వైరైటీస్ చేసుకోవచ్చు. దీనిలో ఉండే ప్రొటీన్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి పనీర్ తో చేసే షాహీ పనీర్ వంటకం చూద్దాం.
కావలసిన పదార్ధాలు:
పనీర్ - పావుకిలో
అల్లంవెల్లుల్లి - టీస్పూన్
ఉల్లిముద్ద - కప్పు
టమాటో గుజ్జు - అరకప్పు
పెరుగు - టేబుల్ స్పూను
జీడిపప్పు ముద్ద - టేబుల్ స్పూను
నానబెట్టిన బాదం, కిస్ మిస్ లు - కొద్దిగా
నిమ్మరసం - 2 టీస్పూన్లు
కొత్తిమీర తురుము - 2 టీస్పూన్లు
ఇంగువ - చిటికెడు
జీలకర్ర - టీస్పూన్
పంచదార - టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో రెండు టీస్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి అందులో పనీరు ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అందులో ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి.
ఆ తరువాత ఉల్లిముద్ద వేసి..అది వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, టమాటో గుజ్జు, పెరుగు, పంచదార వేసి వేయించాలి.
అఖరిలో జీడిపప్పు ముద్ద, నిమ్మరసం కూడా కలిపి ఉడికించాలి. అవసరమైతే కాసిని నీళ్ళు చిలకరించి ఉడికించాలి. చివరగా కిస్ మిస్, బాదం పప్పులు వేసి ఉడికించి దించి కొత్తిమీర చల్లాలి... అంతే షాహీ పనీర్ రెడీ..