సేమ్యా దద్ధోజనం (Navaratri Special)

 

 

 

కావలసిన వస్తువులు:
1.    సేమ్యా 1 కప్పు ( కొద్దిగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి)
2.    చిక్కటి పెరుగు 2 కప్పుస్
3.    ఉప్పు తగినంత
4.    పోపు సామాగ్రి- 2 స్పూనులు
5.    పచ్చిమిరపకాయలు- 2-3 సన్నగా తరిగినవి
6.    కొత్తిమీరా, కరివేపాకు- తగినంత
7.    జీడిపప్పులు, కిస్ మిస్ లు- నేతిలో వేయించి పెట్టుకున్నవి
8.    దానిమ్మ గింజలు- పైన అలంకరణకి
9.    సన్నగా తరిగిన అల్లం ( ఇష్టమైతే వేసుకోవచ్చు)

 

తయారు చేసే విధానం:
1.    ముందుగా సేమ్యాని కొద్దిగా నెయ్యిలో వేయించుకుని ఆ తర్వాత నెళ్ళల్లో మెత్తగా ఉడికించుకోవాలి.
2.    ఉడికిన తర్వాత నీరు పూర్తిగా వంపేసి, ఒకసారి చల్లనీళ్ళతో కడిగాలి.
3.    ఇప్పుడు కొద్దిగా గిలక్కొట్టిన చిక్కటి పెరుగులో ఉడికించిన సేమ్యా, ఉప్పూ వేసి కలిపాలి. పెరుగు పుల్లగా ఉన్నా, పులవకూడదనుకున్నా సగం పాలు కలుపుకోవచ్చు.
4.    మూకుడులో నూనె వేడి చేసి, దాంట్లో పోపు వేసుకోవాలి. పోపు బాగా వేగాకా, ఇంగువ, సనంగా తరిగిన అల్లం, పచ్చిమిర్చీ, కరివేపాకు వేసుకొని అవి కొంచం వేగగానే దింపి చల్లారనివ్వాలి.
5.    ఇప్పుడు చల్లారిన పోపుని ముందుగా కలిపి ఉంచుకున్న సేమ్యా, పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
6.    పైన అలంకరణకి దానిమ్మ గింజలు, తురిమిన కేరట్ వేసుకోవాలి. ఇది వేడిగా తిన్నా, లేక ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

 

 

--వేదుల సుందరి