రవ్వ దోశ

 

 

 

 

కావలసినవి:

బొంబాయి రవ్వ - అరకప్పు
మైదా - అరకప్పు
బియ్యపు పిండి - అరకప్పు
జీలకర్ర - ఒక చెమ్చా
పచ్చిమిర్చి - 4
కరివేపాకు  - తగినంత
ఉప్పు - తగినంత

తయారీ విధానం:
పైన చెప్పిన అన్నిటినీ నీళ్ళలో బాగా కలిపి పలుచటి దోశ మిశ్రమం తయారు చేసుకోవాలి. ఓ పదినిమిషాలు పక్కన వుంచితే నూక నీటిని పీల్చుకుంటుంది. దేశ వేసే ముందు కావాలంటే కొంచెం నీటిని కలుపుకోవచ్చు. పెనం బాగా వేడి ఎక్కిన తర్వాత ముందుగా కొంచెం నూనె వేసి ఆ తర్వాత దోశ పెనం చివరి నుంచి  వేసుకుంటూ రావాలి. గరిటతో మామూలు దోశల మాదిరిగా వేసి తిప్పకూడదు. ఎందుకంటే రవ్వదోశలో మధ్యమధ్య చిన్న చిన్న రంధ్రాలు వుండి కరకరలాడటమే దాని ప్రత్యేకత. ఓ పెద్ద గ్లాసులో లేదా కప్పుతో పెనం మీద దోశల పిండిని పోసి అలా వదిలేసి తక్కువ మంట మీద కాలనివ్వాలి. ఉల్లిపాయలు వేయాలనుకుంటే ముందుగా పెనం మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఆపైన రవ్వదోశ మిశ్రమాన్ని పోయాలి. కొంచెం జాగ్రత్తగా దోశ వేస్తే హోటల్స్‌లో చేసినత చక్కగా ఇంట్లోనే రవ్వదోశ చేసుకోవచ్చు.

 

-రమ