రవ్వ కొబ్బరి ఉప్మా

 

 

వెరైటీ వంటలు చేయడంలో తమిళనాడు మహిళలు ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త వంటలతో అదరగొట్టేస్తూ వుంటారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ వంటల విషయంలో వాళ్ళది ఎప్పుడూ జెట్ స్పీడే. ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా చేసే బ్రేక్ ఫాస్ట్ వంట ‘రవ్వ కొబ్బరి ఉప్మా’ ఎలా చేయాలో చూద్దాం...

 

కావలసిన పదార్థాలు:

గోధుమ రవ్వ - 1 కప్పు (ఇద్దరి కోసం)

ఆవాలు  - అర టీ స్పూను

మినపపప్పు - 1 టీ స్పూను

పచ్చి శనగపప్పు - 1 టీ స్పూను

ఎండు మిరపకాయలు - 2

కరివేపాకు - కొంచెం

ఉల్లిపాయ - ఒకటి

పచ్చి మిరపకాయలు - రెండు

కొబ్బరి తురుము - రెండు స్పూన్లు

నెయ్యి - 2 స్పూన్లు

వంట నూనె - 2 స్పూన్లు

నీరు - ఒకటిన్నర కప్పు

క్యారెట్ ముక్కలు - ఒక చిన్న క్యారెట్

కొబ్బరి ముక్కలు - చిన్నవి 10

అల్లం - కొద్దిగా

 

తయారుచేసే విధానం:

మొదటగా గోధుమరవ్వలో బాణలీలో వేసుకుని, అందులో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. రవ్వ రంగు మారుతున్న సమయంలో పొయ్యి మీద నుంచి దించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె, ఆవాలు, మినప, శనగపప్పులు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, కేరెట్ ముక్కలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి ముక్కలు ... అన్నీ వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి. ఆ తర్వాత అందులో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొబ్బరి కోరు అందులో వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతూ వుండగానే రవ్వని ధారగా పోస్తూ కలుపుకోవాలి. రవ్వ కొద్దిసేపు ఉడికిన తర్వాత, మిగిలిన నెయ్యి అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌ని 5 నిమిషాలపాటు సిమ్‌లో వుంచాలి. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత మూత తీయకుండా ఓ పది నిమిషాలు వుంచాలి. ఆ తర్వాత చట్నీ లేదా చక్కరతో తినవచ్చు. సాధారణంగా చాలామంది ఉప్మా తినరు. అలాంటి వారికి కూడా ఈ రవ్వ కొబ్బరి ఉప్మా నచ్చుతుంది.