బంగాళదుంప బోండా
(కార్తీకమాసం స్పెషల్)
కార్తీక మాసంలో సాధారణంగా అందరూ ఉపవాసాలు ఉంటారు. అలాంటి వారికోసం ఈ అల్పాహారం.
కావలసిన పదార్ధాలు:
* మొలకెత్తిన పెసలు - రెండు కప్పులు
* ఉడికించిన బంగాళదుంపలు - రెండు
* అల్లం - రెండు అంగుళాలు
* పచ్చిమిర్చి - ఆరు
* ఉప్పు - రుచికి తగినంత
* జీలకర్ర - 1/2 స్పూన్
* టమాటా - ఒకటి
* ఆవాలు - 1/2 స్పూన్
* పసుపు - కొద్దిగా
* నూనె - సరిపడినంత
తయారీ విధానం:
* ముందుగా మొలకెత్తిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర తీసుకొని కొద్దిగా ఉప్పువేసి మెత్తగా అంటే గారెల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాణలి తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి అది కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి.
* టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తరువాత.. అందులో ఉడికించుకున్న బంగాళదుంపల ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం అల్లంవేసి బాగా కలపాలి. దీంతో బంగాళదుంప కూర రెడీ అవుతుంది.
* ఇప్పుడు దీనిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలి. మరో బాణలి తీసుకొని దానిలో నూనె పోసి అది కాగిన తరువాత బంగాళదుంప ఉండలను పెసర పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే కరకరలాడే. బంగాళదుంప బోండా రెడీ.