పెరుగు ఆవడ
కావలసినవి :
మినపప్పు - అరకేజీ
పెరుగు - లీటరు
ఉప్పు - సరిపడా
నూనె - అర కేజీ
పోపుదినుసులు - టీ స్పూన్
ఎండిమిర్చి - రెండు
కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - చిటికెడు
వంటసోడా - చిటికెడు
తయారీ:
ముందుగా మినపప్పు నాలుగు గంటలు ముందు నానబెట్టుకోవాలి. నానిన పప్పును శుభ్రంగా కడిగి మెత్తగా గట్టిగా రుబ్బాలి. దీనిలో ఉప్పు కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి పోపు దినుసులు వేగాక,ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దించి పెరుగు తాలింపు పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచేసి నూనె కాగిన పిండితో గారెలు వేసుకుని నూనెలో దోరగా వేయించి తీసి,తాలింపు పెరుగులో వేసి అరగంట ననిన తరువాత సర్వ్ చేసుకోవాలి.