పనీర్‌ టిక్కా రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు:
పన్నీర్‌                    : అరకేజి
ఎండు మిర్చి           : ఐదు
చాట్‌ మసాలా         : 2 టీ స్పూన్లు
అల్లం                      : చిన్న ముక్క
వెల్లుల్లి                     : నాలుగెైదురేకులు
పచ్చి మిరపకాయలు : ఆరు
నూనె                         : సరిపడగా
బంగాళాదుంపలు        : 2
శనగ పప్పు                   : 100 గ్రాములు       
కార్న్‌ఫ్లోర్‌                      : 2 స్పూన్లు

 

తయారీ  విధానం:
ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. కట్ చేసిన పచ్చి మిరపకాయలు ,అల్లం  ముక్కలు  వేగాక శనగపప్పు, ఎండు మిరపకాయలు, మసాలా, ఉప్పు వేసి, శనగపప్పు వేగే వరకు వేయించి పన్నీర్‌ కూడా వేయాలి. ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి ఈ మిశ్రమంలో కలపాలి. తరువాత ఈ కొంచం  మిశ్రమం  చేతిలోకి తీసుకుని టిక్కిలాగా చేసుకుని దానికి కార్న్‌ఫ్లోర్ లో టిక్కిని అద్దాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి వేగనివ్వాలి.