పన్నీర్ టమాట గ్రేవీ కర్రీ
కావలసినవి
పన్నీర్ - 200 గ్రాములు
పసుపు - చిటికెడు
కొత్తిమీర-అర కప్పు
టమాట పేస్ట్ - మూడు
క్రీమ్-కొద్దిగా
ఉల్లిపాయలు-3
ఉప్పు- సరిపడా
కారం- తగినంత
నూనె - తగినంత
ధనియాలపొడి - ఒక స్పూన్
తయారి విధానం :
ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి నూనె వేసి కాగాక సన్నగా కట్ చేసుకున్నఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత కారం, ధనియాలపొడి, పసుపు వేసి వేయించాలి. ఒక ఐదు నిముషాలు వేగాక టమాట పేస్ట్, ఉప్పు వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. కొద్దిసేపు ఉడికాక పన్నీరు ముక్కలు వేసి ఉడికించాలి చివరిలో క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర తో డెకరేట్ చేసుకోవాలి...