పనీర్ స్టిక్స్

 

 

కావలసినవి:

పనీర్ - 200 గ్రాములు

మిరియాల పొడి - అర టీ స్పూను

ఉప్పు - రుచికి తగినంత

మైదా - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - మూడు

వెల్లుల్లి - రెండు

పుదీనా పేస్ట్ - ఒక టీ స్పూను

నిమ్మరసం - ఒక స్పూన్

నూనె - తగినంత

‌అజనొమోటో - అర టీ స్పూను

కార్నఫ్లోర్ - రెండు స్పూన్లు

ఎండు మిర్చి - రెండు

కారం - చిటికెడు

ఎల్లో ఫుడ్‌ కలర్‌ - చిటికెడు

 

తయారీ :

ముందుగా పనీర్‌ను స్టిక్స్‌లా కట్ చేసుకుని ఈ పన్నీర్ స్టిక్స్‌కు మైదా, అజనొమోటో, కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడి, ఉప్పు,ఫుడ్‌ కలర్‌ కలిపిన మిశ్రమం పనీర్ కు అన్ని వైపులా పట్టేలా చూసుకోవాలి. వీటిని పది నిమిషాలు పక్కకి పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు వేసి  బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరే బాణి తీసుకుని నూనె వేసి వేడయ్యాక  అందులో కొద్దిగా వెన్నకొద్దిగా నెయ్యి వేసి  వేడైన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి తురుము , పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి.తరువాత నిమ్మరసం, కారం, అజనమోటో వేసి కలిపి వేయించిన పనీర్ స్టిక్స్‌ను బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి..