పన్నీర్ పులావ్ రెసిపీ
కావలసిన పదార్ధాలు :
పనీర్ 100 గ్రాములు
బాస్మతి ఒక గ్లాస్
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 4
కరివేపాకు 1 రెమ్మ
కొత్తిమీర 1
పుదీనా 1 కట్ట
టమాటాలు మూడు
ఉప్పు సరిపడా
కారం 2 స్పూన్లు
పసుపు అర స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
గరంమసాలా పొడి ఒక స్పూన్
నూనె సరిపడా లవంగాలు,చెక్క,షాజీర,బిర్యానీ ఆకు సరిపడా
తయారి విధానం:
ముందుగా బియ్యం కడిగి ఒక 15 నిముషాలు నానబెట్టుకోవాలి. తరువాత పనీర్ ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం, గరంమసాలా పొడి వేసి కలిపి కొంచంసేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి లవంగాలు,బిర్యానీ ఆకు, షాజీర,దాల్చిన చెక్క, వేసి వేగాకా ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి
తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత ఉడికించి పేస్ట్ చేసుకున్న టమాటమిశ్రమం, కొత్తిమిర పుదినా కూడా వేసి వేయించుకోవాలి
ఇప్పడు పనీర్ ముక్కలు వేసి కారం,పసుపు, గరంమసాలా పొడి వేసి కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగాకా బియ్యం,సరిపడా ఉప్పు ఉడకనివ్వాలి.
స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొత్తిమిరతో అలంకరించుకోవాలి. స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి.