పన్నీర్ పకోడీ

 

 

 

కావలసినవి :
పన్నీర్ : 100 గ్రాములు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : తగినంత
కారం : మూడు స్పూన్లు
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
నూనె : సరిపడ
బియ్యప్పిండి : టేబుల్ స్పూన్
శనగ పిండి : ఒక కప్పు

 

తయారీ :
ముందుగా పన్నీర్ ను చిన్నగా కట్ చేసుకుని వీటిలోనే పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, శనగ పిండి, బియ్యప్పిండి వేసి సరిపడా నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె  వేసి కాగాక కలిపి ఉంచుకున్నపిండితో పకోడిలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి వేడివేడి గా సాస్ తో కాని గ్రీన్ చట్నీ తో కానీ సర్వ్ చేసుకోవాలి.