పనీర్ కొబ్బరి కూర

 

 

కావాల్సిన పదార్దాలు :

పనీర్ – 200 గ్రా

ఉల్లిపాయలు – నాలుగు

టమాటాలు – నాలుగు

అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా

పచ్చిమిర్చి – మూడు

పసుపు – చిటికెడు

ఉప్పు, కారం – తగినంత

కొబ్బరి పాలు – కప్పు

జీలకర్ర, ధనియాల పొడి – చెంచా చొప్పున

వేరుశెనగల పొడి ( పల్లీల పొడి ) – మూడు చెంచాలు

నూనె – తగినంత

కొత్తిమీర – కొద్దిగా


తయారీ విధానం :

ముందుగ ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో పనీర్, ఉప్పు వేసి ఉడికించి, చల్లారక నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత టమాటో ప్యూరి ( టమాట ఉడికించి తొక్క తీసి మెత్తగా రుబ్బాలి ) తయారుచేసుకోవాలి, రెండు ఉల్లిపాయల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద, టమాటో గుజ్జు కలపాలి. నూనె పైకి తేలాక ధనియాల పొడి, శెనగపొడి, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, కప్పు నీళ్ళు వేసి మూతపెట్టాలి. గ్రేవి తయారయ్యాక ఉడికించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి ఐదు నిముషాలు స్టవ్ మీద ఉంచాలి. చివరిగా కొత్తిమీర చల్లి దించేయాలి. పూరీలు, చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.