పనీర్ కచోరి
కావల్సినవి:
పనీర్ తురుము - కప్పు
ఉల్లిపాయలు - 2
నూనె - సరిపడా
నెయ్యి - పావుకప్పు
జీలకర్ర, ఇంగువ - పావుచెంచా
వాము - స్పూన్
ఉప్పు - తగినంత
మైదా - అరకేజీ
కొత్తిమీర తురుము - అరకప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చిమిర్చి - 3
తయారీ:
ముందుగా మైదాను ఓ గిన్నెలోకి తీసుకుని టేబుల్‌స్పూను నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి.. నీటితో పిండిలా కలిపి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత గిన్నెలో స్పూన్ నెయ్యి కరిగించి వాము, జీలకర్ర, ఇంగువ వేయించి ఆ తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పలుకులు వెయ్యాలి. ఉల్లిపాయముక్కలు బాగా వేగాక తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మైదాను ఉండల్లా చేయాలి. ఒక ఉండను తీసుకుని పూరీలా వత్తి మధ్యలో కొద్దిగా పనీర్‌తురుము, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని గుండ్రంగా వచ్చేలా చుట్టూ మూసేయాలి. ఫోర్కుతో అక్కడక్కడా గాట్లు పెట్టాలి. ఇలా అన్నిటిని చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టి నూనె పోసి కాగాక కచోరీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.వీటిని గ్రీన్ చట్నీ తో కాని సాస్ తో కాని సర్వ్ చేసుకోవాలి...