పనీర్ గోంగూర కర్రీ

 

 

కావలసినవి

పనీర్ -100 గ్రాములు

నెయ్యి - కొద్దిగా

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - నాలుగు

గోంగూర - నాలుగు కట్టలు

ఉప్పు - తగినంత

నూనె - తగినంత

లవంగాలు - ఆరు

కారం - టీ స్పూన్

జీడిపప్పు - పది

ఏలకులు - ఆరు

దాల్చిన చెక్క - చిన్నముక్క

అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

కరివేపాకు - రెండు రెమ్మలు

జీలకర్ర - స్పూన్

పసుపు - అర టీ స్పూన్

 

తయారీ విధానం:

ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లుపోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిముషాల తర్వాత తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేస్తే పనీర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పాన్‌లో  నీళ్లు పోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి.

తరువాత గిన్నెలో  నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి చల్లారిన తర్వాత వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత గోంగూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి  అందులో గోంగూర పేస్ట్, పనీర్ ముక్కలు, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు కప్పుల నీళ్లుపోసి తక్కువ సెగమీద ఉడికించి సర్వింగ్  బౌల్ లోకి తీసుకోవాలి...