పాలక్ మసాలా పూరీ

 

 

 

 

కావలసినవి:
పాలకూర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
జీలకర్ర పొడి - అర టీ స్పూన్,
గోధుమపిండి - రెండు కప్పులు
నూనె -  తగినంత
గరం మసాలా - కొద్దిగా
సొంపు పొడి - అర స్పూన్
కారం - ఒక స్పూన్

 

తయారీ:
ముందుగా పాలకూరను కట్ చేసి కడిగి  ఉడికించి నీరు లేకుండా గ్రైండ్ చేయాలి. తరువాత గోధుమపిండిలో పాలకూర పేస్ట్  ఉప్పు, జీలకర్ర పొడి,కారం, గరం మసాలా, అర టీ స్పూన్ సోంపు పొడి వేసి  చపాతీ పిండిలా కలుపుకుని ఒక పదిహేను నిముషాలు పక్కనపెట్టి తరువాత  పిండిని చిన్ని చిన్న ఉండలుగా తీసుకొని పూరీల్లా చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక అందులో తయారు చేసుకున్న పూరీలను వేసి బాగా కాలాక ఇష్టమైన కర్రీ తో వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి.