ఓట్స్ పరోటా

 

 

 

 

కావలసినవి :
ఓట్స్ పౌడర్: 2 కప్స్
గోధుమ పిండి: 2 కప్స్
నువ్వులు: కొద్దిగా
ఉప్పు:  తగినంత
నూనె : సరిపడినంత
పచ్చిమిర్చి: 6
కొత్తమీర : సరిపడినంత

 

 తయారీ :
  ముందుగా ఓట్స్ ను పోడీ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో గోదుమపిండీ, ఓట్స్ పౌడర్, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు  వేసి  తగినంత నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకుని రెండు గంటలు నానపెట్టాలి. పిండి నానిన తర్వాత కొద్దిగా కొద్దిగా పిండి తీసుకొని చపాతిలు చేసుకుని  స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద పరోటాని వేసి కొంచం నూనె వేసి రెండు వైపుల కాలిన తర్వాత దానిని సర్వింగ్  ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా ఓట్స్ పరోట సర్వుచేసుకోవాలి