ఓట్స్ ఇడ్లీ

 

 

 

 

కావలసినవి:
ఓట్స్: 100 గ్రాములు
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు: తగినంత
నిమ్మకాయరసం: ఒక స్పూన్
గోధుమరవ్వ: ఒకటిన్నర కప్పు
అల్లం తురుము: ఒక స్పూన్
పచ్చిమిరపకాయలు: 4
ఆవాలు: ఒక స్పూన్
పెరుగు: ఒక కప్పు
కొత్తిమీర తురుము: కొద్దిగా
శనగపప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
క్యారెట్‌ తురుము: కొద్దిగా
నూనె: సరిపడా

 

తయారు చేయు విధానం:

ముందుగా ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని గోధుమరవ్వ కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి  గిన్నె పెట్టి  నూనెపోసి ఆవాలు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కాయలు వేసి వేగాక క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించిన మిశ్రమాన్ని ఓట్స్‌పొడిలో వేసి బాగా కలిపి ఇందులో  నీళ్లు, పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక పది నిముషాలు అలానే ఉంచి తరువాత ఇడ్లీలు వేసుకుని వేడి వేడిగా చట్నీ తో సర్వ్ చేసుకోవాలి..