ఓట్స్ బాల్స్
కావలసినవి:
ఓట్స్ - అర కప్పు
వండిన రైస్ - ఒక కప్పు
ఆలూ - రెండు
కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
పుదీనా - రెండు స్పూన్స్
కొత్తిమీర - రెండు స్పూన్స్
నూనె - తగినంత
చాట్ మసాలా - ఒక టీ స్పూన్
బ్రెడ్ క్రంబ్స్ - అర కప్పు
ఉప్పు - సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం - ఒక స్పూన్
తయారీ:
ముందుగా ఆలూ కూడా మెత్తగా చేసి రైస్ ఒక బౌల్ లోకి తీసుకుని రెండిటిని కలుపుకోవాలి. ఇందులో తరిగిన పుదీనా, కొత్తిమీర, ఉల్లి,మిర్చి, అల్లం వేయాలి. తరువాత ఓట్స్ , చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్ ,తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించికుని కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా కాగాక కలిపి ఉంచుకున్న మిశ్రమంను కొద్దిగా తీసుకుని బాల్స్ లా చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని సాస్ తో సర్వ్ చేసుకోవాలి.