నెల్లూరు పుణుకులు
కావలిసినవి:
రైస్ - నాలుగు కప్పులు
మినపప్పు - రెండు కప్పులు
సెనగపప్పు - చిన్న కప్పుతో
అల్లం - చిన్న ముక్క
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
వంటసోడా - చిటికెడు
జీలకర్ర - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా రైస్ ను, మినపప్పును నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు గంటల తరువాత నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత రెండిటిని కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. తరువాత పైన తయారు చేసిన పిండిలో కలపాలి. అలాగే సెనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక బాణిలో నూనె పోసి బాగా ఎర్రగా కాగాక, పిండిని తీసుకొని గుండ్రంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి నూనెలో వేయించాలి. అంతే వేడి వేడిగా నెల్లూరు పుణుకులు రెడీ.