మష్రూమ్ ఫ్రై

 

 

 

కావలసినవి :
మష్రూమ్స్ : 250 గ్రాములు
ఉల్లిపాయలు : రెండు
ఉప్పు : తగినంత
పెప్పర్ పౌడర్  : అర స్పూన్
పచ్చిమిర్చి : రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్
నూనె : తగినంత
పసుపు : చిటికెడు
కొత్తిమీర పొడి : ఒక స్పూన్
కరివేపాకు పొడి : ఒక స్పూన్
నిమ్మరసం : ఒక స్పూన్

 

తయారి విధానం :
ముందుగా మష్రూమ్స్ కట్ చేసుకుని నీళ్ళల్లో ఉప్పు వేసి కాచి  దానిలో మష్రూమ్స్ ముక్కలు వేసి ఒక 30 నిముషాల పాటు నానపెట్టాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్  వేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు మష్రూమ్స్ కరివేపాకు పొడి,పెప్పర్, కొత్తిమీర పొడి,పసుపు వేసి కాసేపు వేయించాలి. ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిలో నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి