ములక్కాయ కర్రీ రెసిపి
కావలసినవి:
ములక్కాయలు - 2
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 2
శనగపప్పు- అర స్పూన్
మినప్పప్పు- అర స్పూన్
కరివేపాకు - కొన్ని
ఆవాలు - అర స్పూన్
జీలకర్ర- అర స్పూన్
ఎండుమిర్చి- 2
మిర్చి - 4
ఉప్పు,కారం- సరిపడా
పసుపు - కొంచెం
పాలు - అర కప్పు
తయారు చేసే విధానం:
స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసుకుని వేగాకా . కట్ చేసిన ఉల్లిపాయలు,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు కట్చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసి వేయించాలి రెండునిమిషాల తరువాత ఉప్పు,కారం పసుపు వేసి సరిపడా నీళ్ళు పోసి కలిపి ఉడికించాలి.
నచ్చిన వాళ్ళు ఇందులో పాలు కూడా కలుపుకోవచ్చు. అప్పుడు ఈ కర్రీ ఇంకా టేస్టీ గా వుంటుంది