మల్టీగ్రెయిన్ ఉతప్పం రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

జొన్నలు - అర కప్పు,

సజ్జలు - ఒక కప్పు,

గోధుమలు - అరకప్పు,

పచ్చికొబ్బరి - అరకప్పు,

టమోటా - ఒకటి,

రాగులు- అరకప్పు,

సోయాబీన్స్ - అరకప్పు

ఉల్లిపాయ - ఒకటి,

పచ్చి మిరపకాయలు- నాలుగు 

కరివేపాకు - ఒకరెబ్బ,

బీట్‌రూట్ - ఒకటి

కొత్తిమీర - ఒక కట్ట,

నూనె- సరిపడా,

ఉప్పు - తగినంత.

క్యారెట్ - రెండు

 

తయారుచేయు విధానం:

ముందుగా రాగులు,జొన్నలు ,సజ్జలు ,సోయాబీన్స్,గోధుమలు అన్నిటిని కలిపి ఒక అరగంట పాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు గంటల పాటు పక్కనపెట్టుకోవాలి.

తరువాత కూరగాయనన్నిటిని సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, కరివేపాకు,తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకుని చుట్టూ కాస్త నూనె రాయాలి.

గరిటతో పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిపెట్టుకున్న ముక్కలు ఉతప్పం పై వేసి పైన కొంచం ఆయిల్ వేసి మూతపెట్టుకోవాలి.

రెండో పక్క కూడా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని కొబ్బరి చట్నీ తో తీసుకుంటే చాల రుచిగా వుంటుంది..