ముల్లంగి చపాతీ

 

 

 

కావలసినవి:
ముల్లంగి - రెండు
గోధుమపిండి - రెండు కప్పులు 
కారం - తగినంత 
నెయ్యి - చిన్న కప్పు 
బియ్యపుపిండి - ఒక కప్పు
పసుపు - చిటికెడు 
నూనె, ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం:
ముందుగా ముల్లంగిని చిన్నచిన్న ముక్కలు చేసుకుని, నీళ్ళలో పసుపు, ఉప్పు వేసి ముల్లంగిని ఉడకబెట్టుకోవాలి. తరువాత నీళ్ళని వార్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కారం కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో నెయ్యి, ఉప్పు, నీళ్ళు వేసి ముద్ద చేసుకోవాలి. తరువాత ఉండలుగా చేసుకొని ఒక్కో ఉండను బియ్యపు పిండిలో వత్తి పూరీలా చేసుకొని దాని మధ్యలో ఒక స్పూను ముల్లంగి ముద్దను పెట్టి అన్ని వైపులా మడిచి చపాతీలా వత్తుకోవాలి. పెనం మీద ఈ చపాతీలు వేసి రెండు వైపులా నూనె రాసి కాల్చుకోవాలి. ఈ చపాతీలు వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.