ములక్కాయ కొబ్బరి కూర

 

 

 

కావలసినవి:
ములగకాడలు - ఐదు 
టమోటాలు - నాలుగు 
కొబ్బరి తురుము - ఒక కప్పు 
ఉల్లిపాయలు - మూడు 
పచ్చిమిర్చి - ఐదు 
పోపుసామాగ్రి - ఒక స్పూను 
పసుపు - చిటికెడు 
కరివేపాకు - రెండు రెబ్బలు 
కారం, ఉప్పు, నూనె - తగినంత

 

తయారు చేసే విధానం:
ముందుగా ములక్కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి, అది కాగాక పోపు వేసి వేయించాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అందులోనే ములగకాడ ముక్కలను, కొద్దిగా నీరుపోసి మూతపెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. ముక్కలు ఉడుకుతుండగానే తగినంత ఉప్పు,పసుపు, టమోటాలు, కరివేపాకు, కారం వేసి ఇగురుగా తయారు చేసుకోవాలి. తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి. అంతే ములక్కాయ కొబ్బరి కూర రెడీ.