ముడి పెసలు మసాలా

 

 

 

కావలసిన పదార్థాలు
మొలకల పెసలు : ఒక కప్పు
నూనె: సరిపడా
టమోటా : 2
ఉల్లిపాయలు : 2
ఉప్పు :  సరిపడా
ఆలూ :2
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : ఒక స్పూన్
పసుపు: అర స్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
పచ్చిమిర్చి : 2
గరంమసాలా : 1స్పూన్
కారం: 1స్పూన్

 

తయారు చేయు విధానం :
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత ఆలూ  ఉడకపెట్టి పైన తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్‌ పెట్టి అందులో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్‌ వేసి  వేగనిచ్చి అందులో టమోటా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి పెసలు, ఆలూ వేసి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పెసలు ఉడికాక అందులో గరంమసాలా వేసి భాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసుకొని స్టవ్  ఆఫ్‌ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి  తీసుకోవాలి వీటిని బ్రేక్ ఫాస్ట్ లా ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు