పెసరపప్పు హల్వా!

 

   

కావలసినవి:
పెసరపప్పు - మూడు కప్పులు
నెయ్యి - చిన్న కప్పు 
చక్కెర - నాలుగు కప్పులు
పచ్చికోవా - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
జీడిపప్పు - రెండు స్పూన్లు
టూటీ ఫ్రూటీ - కొద్దిగా

తయారుచేసే పద్ధతి:
ముందుగా పెసరపప్పు కడిగి నీటిలో మూడుగంటలు నానబెట్టాలి. తర్వాత నానిన పప్పును బాగా కడిగి, మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలీలో నెయ్యి వేడిచేసి గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్దను వేసి, నెయ్యి పైకి వచ్చేలా సన్నని మంటపై  కలుపుతూఉంటే పెసరపప్పు ముద్ద పచ్చిదనం పోతుంది. ఇప్పుడు దానిలో చెక్కెర, కోవా   కలుపుకోవాలి.  చెక్కెర, కోవాలు కరిగి పలచగా తయారవుతాయి. ఇది హల్వాముద్దలా గట్టిపడేవరకూ కలుపుతూవుండాలి. ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు కొంచెం మిఠాయి రంగు, యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు ఒక డిష్‌లో వేసి, పైన సన్నగా తరిగిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి.