మొక్కజొన్న వడలు!

 

కావలసినవి:

మొక్కజొన్న పొత్తులు - ఐదు 

అల్లం - చిన్న ముక్క 

పచ్చిమిర్చి - ఐదు 

కరివేపాకు - నాలుగు రెబ్బలు 

క్యాప్సికమ్ -ఆరకేజీ

ఉల్లిపాయలు - నాలుగు 

ఉప్పు, నూనె -తగినంత


తయారుచేసే విధానం:

ముందుగా మొక్కజొన్న పొత్తులను ఒలిచి వాటి గింజలను కండె నుంచి తొలగించాలి. తరువాత ఉల్లిపాయలను, కాప్సికమ్ బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చి గింజలను మిక్సీలో వేసి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రైండ్  చేసిన మొక్కజొన్న మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికమ్, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కొక్క ముద్దను ఆరచేతిలో వడలా నొక్కి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు రెడీ. 

 

Attachments area