మిక్స్‌డ్  వెజిటబుల్‌ కర్రి రెసిపి

 

 

 

కావలసిన పదార్దాలు :

క్యారెట్‌ : 2

టమోటాలు : 2

పచ్చిబఠాణి : అర కప్పు

ఆలూ: 3

బీట్‌రూట్‌ : 1

పెద్ద ఉల్లిపాయ : 1

కారం : 1 టీ స్పూన్‌

పసుపు : అర స్పూన్

అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 స్పూన్‌

పచ్చిమిర్చి : 3

ఎండుమిర్చి : 2

ఉప్పు : సరిపడా

కొతిమీర : 1 కట్ట

ఆయిల్: 3 స్పూన్లు

ఆవాలు : అర స్పూన్

జీరా : 1 టీ స్పూన్‌

 

తయారుచేయు విధానం :

పచ్చిబఠాణి ఉడకబెట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి . క్యారెట్‌, బీట్‌రూట్‌, ఆలూ లను పొట్టు తీసి శుభ్రం చేసుకుని కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టాలి.టమోటాలను కట్ చేసిపెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌ వెలిగించి గిన్నెపెట్టి ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,కరివేపాకులతో తాలింపు పెట్టి దానిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత టమోటా ముక్కలను కూడా వేయించుకోవాలి.

తరువాత దానిలో అల్లం పేస్ట్‌, కారం, పసుపు వేసిబాగా కలపాలి . ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠాణిలు, కూరగాయలు వేసి వేసి బాగా కలిపి సరిపడా నీళ్ళు పోసి , తగినంత ఉప్పు కూడా వేసుకుని గ్రేవీ చిక్కబడేవరకు ఉడికించుకుని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి.

చివరిలో కొత్తిమిర వేసుకోవాలి.