మీల్ మేకర్ కీమా రెసిపి

 

 

 

కావలసిన పదార్దాలు :
మీల్ మేకర్ : 100 గ్రాములు
కారం : 2 టీ స్పూన్లు
జీలకర్ర : అర టీ స్పూన్
నూనె :సరిపడా
జీడిపప్పులు : కొద్దిగా
ఉప్పు : తగినంత
గసగసాలు : 1 స్పూన్
కొబ్బరి పొడి : 2 టీ స్పూన్లు
జీలకర్ర పొడి :1 టీ స్పూన్
గరం మసాలా : అర టీ స్పూన్
దనియాల పొడి : 1స్పూన్
ఉల్లి పాయలు : 3
టమాటాలు : 3
పచ్చిమిర్చి : 5
కొత్తిమీర : అర కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
పసుపు : అర టీ స్పూన్

 

తయారుచేయు విధానం :
ముందుగా మిల్ మేకర్ ని మరిగించిన  నీటిలో వేసి రెండు నిముషాలు వుంచి తరువాత  ఆ నీటిని పిండి కీమాలాగా చిన్నగా  కట్ చేసుకోవాలి.ఇప్పుడు మసాలకోసం  జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి కలిపి  పేస్ట్ లా చేసుకోవాలి.తరువాత  స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గాక  మసాలా పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళుపోసి ఐదు నిముషాలు ఉడికించాలి. ఆ తరువాత మిల్ మేకర్ కీమా,వేసి ఉడికించి గరంమసాలా వేసి ఒక రెండు నిముషాలు ఉడికించాక సర్వింగ్ బౌల్  లోకి తీసుకుని కొత్తిమిర వేసి రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేయవచ్చు...