మసాలా పూరీలు రెసిపి
కావలసినవి :
మైదా - పావు కేజీ
సోయా పిండి - 3 స్పూన్లు
మొక్కజోన్న పిండి - 3 స్పూన్లు
అల్లం - తగినంత
నూనె - సరిపడా
జీలకర్ర - 4 స్పూన్లు
పచ్చిమిర్చి - 10
డాల్డా - కలపడానికి సరిపడా
ఉప్పు - తగినంత
ఎండు కొబ్బరి - ఒకటి
తయారీ :
ముందుగా ఒక గిన్నె తీసుకుని మొక్కజొన్న పిండి, సోయా, మైదా కొబ్బరి తురుము తీసుకుని కరిగించిన డాల్డా వేసి బాగా కలపాతి ఇప్పుడు అల్లం,జీలకర్ర పచ్చిమిర్చి ఈ మూడింటిని పేస్ట్ చేసి పిండిలో కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసి కాగాక పిండిని ఉండల్లా చేసి పూరిల్లా చేసుకుని కాగుతున్న ఆయిల్ లో వేసి వేయించాలి.