మసాలా గోరు చిక్కుడు కర్రీ

 

 

 

కావలసిన పథార్థాలు :
గోరు చిక్కుడు  - అర కిలో
ఉప్పు - తగినంత
పచ్చి మిర్చి -      4
గరం మసాలా పొడి - 1/2 టీ స్పూను
నునె - సరిపడా
కారము -1 టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను
ఉల్లిపాయలు -    2
పసుపు - అర టీ స్పూను

 

తయారు చేయు విధానం :
ముందుగా గోరుచిక్కుడును  ముక్కలు గా కట్ చేసి, నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించాలి. ఉడికాక నీటిని  తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.తరువాత ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి  ఆయిల్ వేసి వేడి చేసి ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి , పసుపు , కారము, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి,  బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోరు చిక్కుడు వేసి కొద్దిసేపు ఆగి గరంమసాలా వేసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.