Kobbari Vada Recipe

 

 

 

కావలసిన పదార్ధాలు

కొబ్బరికాయ – 1

బియ్యం – పావుకిలో

నూనె – పావుకిలో

ఉల్లిపాయలు – 2

పచ్చిమిర్చి - 6

కొత్తిమీర – 1

కట్ట జీలకర్ర – 1 టీ స్పూను

వంట సోడా – చిటికెడు

కరివేపాకు – 2 రెబ్బలు

ఉప్పు - తగినంత

 

తయారు చేసే పద్ధతి

కొబ్బరిని తురమాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. బియ్యం కడిగి నానబెట్టాలి.

నీళ్ళు ఓడ్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి నూరి కలపాలి. వంటసోడా,

ఉప్పు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.

బాణలిలో నూనె కాగనిచ్చి కలిపి ఉంచుకున్న పిండిని వడల్లా వత్తి ఎర్రగా వేయించుకోవాలి.

కొబ్బరి వడలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.