కేరళ సాంబార్

 

 

 

కావల్సినవి:
కంది పప్పు - అరకప్పు
ఎర్ర కందిపప్పు - అరకప్పు
పొట్లకాయ - ఒకటి
క్లస్టర్ బీన్సు - ఆరు
బెండకాయలు - ఆరు
చిన్న సైజు  చేమగడ్డలు - ఆరు
వంకాయ - ఒకటి
దోసకాయ - ఒకటి
ములగకాయలు - రెండు
బంగాళదుంప -ఒకటి
ఇంగువ -  చిటికెడు
ఉప్పు - సరిపడా
కరివేపాకు - కొద్దిగా
కొత్తమీర - తగినంత
టమోటో -ఒకటి
చిన్న ఉల్లిపాయలు - పది
సాంబార్ పొడి -     3 టేబుల్ స్పూన్లు
మిరపకాయలు -     3 ఎండు
చింతపండు రసం - ¼ కప్పు
ఆయిల్ - తగినంత
ఆవాలు - 1 టేబుల్ స్పూన్

 

తయారీ :
ముందుగా  పప్పులు, పసుపు, ఉప్పు,కూరగాయలను  కుక్కర్లో వేసి సరిపడా  నీటిని పోసి ఉడికించుకోవాలి.  ఆవిరి  మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసి స్టవ్ పై పెట్టి సాంబార్ పౌడర్ వేసి  చింతపండు రసం మరియు ఇంగువ వేసి బాగా సరిపడా నీటిని పోసి  బాగా కలిపి మరిగించాలి. సాంబార్ మరిగాక పక్క స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి మరియు కరివేపాకులతో పోపు వేసి మరుగుతున్న  సాంబారును పోపులో వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని  వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.