కీమా బ్రెడ్ శాండ్‌విచ్

 

 

 

 

కావాల్సిన పదార్థాలు:
కీమా - పావుకిలో
బ్రెడ్ - ఎనిమిది ముక్కలు
కారం - రెండు టీ స్పూన్లు
టమాటాలు - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - మూడు
గరంమాసాలా - ఒక టీ స్పూను
పసుపు - తగినంత
ఉప్పు - తగినంత
కరివేపాకు - ఒక రెబ్బ
కొత్తిమీర - ఒక కట్ట
షాజీరా - కొద్దిగా
కాజు పేస్ట్ - రెండు టీ స్పూన్లు
బటర్ లేక నూనె - సరిపడగా
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు

 

తయారీ :

ముందుగా స్టవ్ వెలిగింది కుక్కర్ పెట్టి నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక వెల్లుల్లి పేస్టు, షాజీరా కూడా వేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కీమాను వేసి నీరు పోయేంత వరకూ ఉడికించాలి. ఇందులో  టమోటాలు ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించిన తరువాత కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కాజు పేస్ట్ వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత విజిల్ తీసి గరంమసాలా వేసి రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత బ్రెడ్‌ పై అప్లయి చేసి పైన మరో బ్రెడ్‌తో కవర్ చేసి పెనం పై బటర్ కాని నూనె కాని వేసి కాల్చుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి....