కంద ఫ్రై
పదార్థాలు:
కంద : పావు కిలో
మిరపకాయలు : ఆరు
ధనియాలు : ఒక స్పూన్
పసుపు : చిటికెడు
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత
తయారీ :
ముందుగా కందగడ్డ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిరపకాయలు, ధనియాలు, ఉల్లిముక్కలు, ఉప్పు, పసుపు అన్నిటిని పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ ని కందముక్కలకు పట్టించి అరగంట పాటు నాననివ్వాలి.ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక కంద ముక్కలు వేసి ఒక పది పదిహేను నిముషాలు వేయించుకోవాలి. దీన్ని రైస్ లో సైడ్ డిష్ గా తీసుకోవచ్చు.