బచ్చలి కంద కూర

 

 

 

కావలసిన పదార్థాలు:
బచ్చలి కూర - రెండు కట్టలు
కంద - పావుకేజీ
చింతపండు - కొద్దిగా 
ఆవాలు - నాలుగు స్పూన్లు 
పచ్చిమిర్చి - మూడు 
ఎండుమిర్చి - నాలుగు 
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు, నూనె - తగినంత 

 

తయారుచేయు విధానం:
ముందుగా కంద చెక్కు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి. తరువాత బచ్చలి కూరని కూడా సన్నగా తరగాలి. రెండింటినీ శుభ్రంగా కడిగి పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించాలి.ఈ మిశ్రమాన్ని దించి, చిల్లుల పళ్లెంలో వేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న నీరు అంతా ఇంకిపోతుంది. చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో  నూనె వేసి కాగాక ఎండుమిర్చి ముక్కలు వేసి అవి ఎర్రగా అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే బచ్చలి కంద కూర రెడీ.