జొన్న సమోసాలు
కావలసినవి:
జొన్న పిండి - ఒక కప్పు
మైదా - ఒక కప్పు
నెయ్యి - తగినంత
ఉడికించిన ఆలూ - రెండు
ఉల్లిపాయలు - ఒకటి
పచ్చిమిరపకాయ - మూడు
కరివేపాకు - తగినంత
ఉడికించిన బఠాణీలు - ఒక కప్పు
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
తయారీ :
* ముందుగా జొన్న పిండి, మైదాలను గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ మెత్తటి ముద్దలా కలపాలి.
* తరువాత చిన్న ఉండలు చేసి ఉండలు చేసుకుని చపాతీల్లా చేయాలి. చపాతీని రెండు భాగాలుగా కోయాలి.
* తరువాత ఉడికించిన ఆలూను మెత్తగా నలిపి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి.
* తరువాత ఉడికించిన బఠాణీలు,సరిపడా ఉప్పు వేయాలి.
* ఈ మిశ్రమాన్ని కట్ చేసుకున్న చపాతీ ముక్కల్లో పెట్టాలి ఇలానే అన్నిటిని రెడీ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి కాగాక తయారుచేసి పెట్టుకున్న సమోసాలను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకుని సాస్ తో సర్వ్ చేసుకోవాలి...