Jeera Gobi Recipe

 

 

 

కావలసిన పదార్థాలు :

కాలీఫ్లవర్ - 1

పచ్చిమిర్చి – 6

జీలకర్ర – 15 గ్రాములు

పసుపు – 1స్పూను

కారం - 1 టీ స్పూను

ఉప్పు – తగినంత

రిఫైన్డ్ ఆయిల్ – 50 గ్రాములు

 

తయారు చేసే పద్ధతి :

కాలీఫ్లవర్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచి శుభ్రం చేయాలి. ఓ గిన్నెలో నీళ్ళు, వేడి చేశాక, ఈ ముక్కల్ని వేసి కొద్ది సేపు ఉడికించండి. బాణలిలో నూనె పోసి సగం జీలకర్రను వేసి కాసేపు ఫ్రై చేసి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి వేయించాలి. దించేముందు పసుపు, కారం, ఉప్పు, మిగిలిన జీలకర్ర వేయాలి. జీరా గోబీ అన్నంలోనే కాకుండా, చపాతీతో తిన్నా బాగుంటుంది.