క్యారెట్ పాలకూర రైస్ లేయర్ రెసిపి
(స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్)

 

 

 

కావలసినవి:
రైస్ లేయర్ కోసం :
బాస్మతి - ఒక కప్
జీర -అర స్పూన్
ఆలివ్ ఆయిల్- రెండు స్పూన్స్
సాల్ట్  -సరిపడా
పాలకూర లేయర్ కోసం :
పాలకూర - రెండు కట్టలు( కట్ చేసినవి)
పచ్చిబఠానీ - రెండు కప్పులు
పచ్చిమిర్చి -3
ఉల్లిపాయ- ఒకటి ( కట్ చేసినది)
ఆయిల్ - సరిపడా
ఉప్పు - తగినంత
క్యారెట్ లేయర్ కోసం:
తురిమిన క్యారెట్ - ఒకటిన్నర కప్పు
షాజీర - అర స్పూన్
కొత్తిమిర పొడి - ఒక స్పూన్
జీలకర్ర పొడి- ఒకటిన్నర స్పూన్
ఆయిల్ - సరిపడా
ఉప్పు - తగినంత
చీస్ - కొద్దిగా

 

తయారీ:
ముందుగా బాస్మతి రైస్ ను వండి పక్కన పెట్టుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించి పాన్  పెట్టి ఆయిల్ వేసి జీర వేసి కొంచంసేపు వేగనివ్వాలి.ఇందులో రైస్ వేసి జాగ్రత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
తరువాత  పాలకూర శుభ్రం చేసుకుని ఉడకబెట్టి పక్కన నీరు మొత్తం వంచేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకుని,పచ్చి బఠానీ (ఒక గంట ముందు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి) పాలకూర వేసి సాల్ట్ కూడా  వేసి ఉడికిపోయక పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి షాజీర వేసి వేగాక క్యారెట్ తురుము అర కప్పు నీళ్ళు వేసుకుని వెయ్యాలి.తరువాత కొత్తిమిర పొడి,సాల్ట్ వేసి కొంచం సేపు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒవెన్ బేకింగ్ డిష్ తీసుకుని ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ రాసి ఒక లేయర్ రైస్,ఒక పాలకూర, ఒక లేయర్ క్యారెట్ వేసి ఇలా మొత్తం వేసి పైన గార్నిష్ కోసం కొంచం చీస్ వేసి ఒవెన్ లో 220C లో పెట్టి 20 నిముషాలు ఆన్ లో వుంచాలి.