రవ్వ ఇడ్లీ

 

 

 

కావాల్సిన పదార్థాలు:

బొంబాయి రవ్వ            - 1 కప్పు
జీడిపప్పు                     - 20
పచ్చిబఠాని                  - 1 టేబుల్ స్పూన్స్
అల్లం                           - కొంచెం
పచ్చిమిర్చి                   - 3
నూనె                            - 2 స్పూన్స్
ఉప్పు                            - సరిపడ
క్యారెట్                          - 1
పెరుగు                          - 2 కప్స్
పోపు దినుసులు            - తగినంత 
కరివేపాకు                     - 2 రెమ్మలు
కొత్తిమీర                        - 1 కట్ట

 

తయారీ విధానము:

* బాణలిలో నూనె వేసి కాగాక అందులో ముందుగా జీడిపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

* అదే బాణలిలో పోపు దినుసులు వేసి, వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిబఠాని కూడా వేసి వేయించాలి. తర్వాత బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.

* వేరే గిన్నెలో చల్లారిన మిశ్రమాన్ని తీసుకోని దానిలో పెరుగు, ఉప్పు కలపాలి. మిశ్రమం గట్టిగా వుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు.

* ఇందులో తరిగిన క్యారెట్‌, కొత్తిమీర, జీడిపప్పు కలిపిన తర్వాత మిశ్రమాన్ని దాదాపు 15 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి.

* ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్‌లో వేసి కుక్కర్‌లో వాటర్ పోసి స్టౌవ్ మీద పెట్టాలి అంతే 10 నుంచి 15 నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీ రెడీ.


Tip :

1 పెరుగు పుల్లగా వుంటే బాగుంటుంది.

2 మనము కలుపుకున్న ఇడ్లీ మిశ్రమం ఎంత నానితే అంత మెత్తగా ఇడ్లీ వస్తాయి. నానకపోతే ఇడ్లీ గట్టిగా వస్తాయి. ఇలా రాకుండా వుండాలంటే బేకింగ్ షోడాని చిటికెడు కలపండి........
https://www.youtube.com/watch?v=znRSxNsqQHg&t=10s

 

- Sandhya