మష్రూమ్ సూప్
కావలసినవి :
మష్రూమ్స్- అరకప్పు
బేబీకార్న్ ముక్కలు - 1 కప్పు
వెజిటబుల్ స్టాక్ (కూరగాయలు
ఉడికించిన నీళ్లు) - అర లీటర్'
క్యారెట్ ముక్కలు - అరకప్పు
ఉప్పు - తగినంత
నూనె - 1 స్పూన్
సోయాసాస్ - 2 స్పూన్లు
వెనిగర్ - 2 స్పూన్లు
తయారీ :
ముందుగా వెజిటబుల్ స్టాక్‌లో మష్రూమ్స్, బేబీకార్న్, క్యారెట్ ముక్కలు, ఉప్పు కలిపి ఉడకబెట్టాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సోయాసాస్, వెనిగర్ కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి...
స్వీట్‌కార్న్ సూప్
కావలసినవి:
ఉడికించిన స్వీట్ కార్న్ - 2 కప్పులు
పాలు - 1 కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ - 1 కప్పు
బట్టర్ - 2 స్పూన్లు
మైదా - 2 స్పూన్లు
ఉప్పు - తగినంత
పెప్పర్ పొడి - 1 స్పూన్
తయారీ :
ముందుగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ , స్వీట్ కార్న్ గింజలు మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో వెన్న వేసి మైదాపిండి వేయించాలి. అందులోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పేస్ట్ , పాలు కలిపి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఉప్పు, పెప్పర్ పొడి వేసి కొద్దిసేపు ఉడికించి సూప్ చిక్కగా అయ్యాకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...